:. I LOVE MOTHER .:

Saturday, 6 August 2011




అనురాగాల అందమైన జగతిలో

మమతల దీపం అమ్మ

మెరిసే నక్షత్ర వినీలాకసంలో

పున్నమి జాబిలి అమ్మ

రంగురంగు విరిసే కుసుమాలలో

చిమ్మే గంధం అమ్మ

చిగురుటాకులలో సుమధురంగా వినిపించే

కోకిలగానం అమ్మ

ప్రశాంతమైన కోవెల కొలనులో

అందమైన తామర అమ్మ

ఆహ్లాదం చిందే పసిపాప

మోములోని దరహాసం అమ్మ

ప్రభాత ఉషోదయంలో

తొలి రవికిరణం అమ్మ

సంధ్యాసాయంత్రంలో

విరిసే వెన్నెల అమ్మ

ప్రేమ, మమత, ఆప్యాయత

అనురాగాల కౌగిలి అమ్మ

మన ప్రతివిజయం వెనుక

కారణభూతం అమ్మ

మన ప్రగతిని కాంక్షించే

దీవెనల అంబరి అమ్మ

ఈ విశాల విశ్వంలో

సాటిలేని పోటీలేని ఉన్నత స్థానంలో

దేవు డు మలచిన తన ప్రతిరూపం అమ్మ.




--
4 EVER:

    U R - -   
             DURGESH PATTEM